Trump: న్యూక్లియర్ డీల్ పై ఇరాన్ కు ట్రంప్ లేఖ...! 1 y ago
అణు ఒప్పందంపై ఇరాన్ తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి లేఖ రాశానని చెప్పారు. మీడియా ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. చర్చలకు వారు అంగీకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. "ఇరాన్ ముందు రెండు మార్గాలున్నాయని.. సైన్యం, లేదా ఒప్పందం చేసుకోవడనికి రెడీ అన్నారు. ఒప్పందానికే తాను ప్రాధాన్యం ఇస్తానాని, ఎందుకంటే ఇరాన్ ను దెబ్బతీయాలనుకోవడం లేదని తెలిపారు. చర్చలు జరుపుతారని ఆశిస్తున్నాని.. ఇరాన్ కు ఇది చాలా ప్రయోజనకరం" అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.